ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు.. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాను.. 6న స‌మావేశం : వీహెచ్‌

Hanumantha Rao Demands Govt For Ambedkar Statue. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్రహాన్ని వెంటనే పంజాగుట్ట వద్ద ఏర్పాటు

By Medi Samrat  Published on  4 Sep 2021 9:06 AM GMT
ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు.. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాను.. 6న స‌మావేశం : వీహెచ్‌

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్రహాన్ని వెంటనే పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు వీ. హ‌నుమంత‌రావు డిమాండ్ చేశారు. శ‌నివారం విలేక‌రుల‌తో వీహెచ్ మాట్లాడుతూ.. అంబేద్క‌ర్ విగ్రహాన్ని పంజాగుట్టలో ఏర్పాటు చేయాలని మూడేళ్ల నుంచి నేను పోరాటం చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో 6వ తేదీన సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంటల వరకు అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ మేర‌కు అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశానని పేర్కొన్నారు. సమాజంలో బీసీలు కూడా చాలా వెనుకబడి ఉన్నారని.. వాళ్లకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధును స్వాగతిస్తున్నామ‌ని.. ఒక్క హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికి అమలు చేయాలని వీహెచ్ ప్ర‌భుత్వాన్ని కోరారు.


Next Story
Share it