Hanamkonda: కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు

కారుకు గీతలు గీశారని 8 మంది చిన్నారులపై కేసు పెట్టాడో కానిస్టేబుల్‌. రిపేరుకు డబ్బులిస్తామని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పిన కానిస్టేబుల్ వినలేదు.

By అంజి  Published on  25 Sept 2024 10:12 AM IST
Hanamkonda, CID constable , children, scratching, car

Hanamkonda: కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు 

కారుకు గీతలు గీశారని 8 మంది చిన్నారులపై కేసు పెట్టాడో కానిస్టేబుల్‌. రిపేరుకు డబ్బులిస్తామని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పిన కానిస్టేబుల్ వినలేదు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ‌కారుకు గీతలు గీసిన వారిలో అంతా 2 నుంచి 9 ఏళ్లలోపు వారే ఉండడం గమనార్హం. హనుమకొండ రాంనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో సీఐడి విభాగంలో పని చేసే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు. అదే అపార్ట్ మెంట్‌లో పార్కింగ్‌లో చిన్నారులు ఆడుకుంటుండగా కానిస్టేబుల్ కారుపై గీతలు పడ్డాయి.

అది గమనించిన కానిస్టేబుల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కావాలనే పిల్లలందరూ కలిసి తన కారుపై గీతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారులపై పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఇటీవల పిల్లల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలవడంతో.. కేసు నమోదైన విషయం తెలిసింది. చిన్నపిల్లలపై కేసు నమోదు చేయడమేంటని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. గీతలు పడినందుకు డబ్బులు కూడా ఇస్తామంటూ పిల్లల తల్లిదండ్రులు చెప్పారు. అయినా కూడా కానిస్టేబుల్ వినకుండా పిల్లలపై కేసు పెట్టాడు.

Next Story