ఇంటర్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్ లింకులు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు హాల్ టికెట్ లింక్‌లను పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

By Knakam Karthik
Published on : 30 Jan 2025 4:37 PM IST

Telangana, Education News, Inter Hall Tickets, Inter Board, Public Exams

ఇంటర్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్ లింకులు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు హాల్ టికెట్ లింక్‌లను పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గతంలో కళాశాలలకు మాత్రమే హాల్ టిక్కెట్లు పంపేవారు, అయితే ఇప్పుడు విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో లింక్‌ను అందుబాటులో ఉంచారు.

విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్ లింక్‌లు పంపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరలో హాల్ టిక్కెట్లు పంపిస్తామని అధికారి తెలిపారు. మార్చి 5న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షలకు మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

జనవరి 29 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్‌ పరీక్షలు ఉన్నందున ఇప్పటికే అధికారులు విద్యార్థుల మొబైల్‌ నెంబర్‌కు హాల్‌టికెట్ లింక్‌ పంపించారు. సెకండియర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నందున త్వరలో హాల్‌టికెట్‌ లింక్‌ విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌కు పంపించనున్నారు.

Next Story