ఎండలో పాదయాత్ర చేసి అనారోగ్యం పాలవొద్దు.. భట్టికి గుత్తా సలహా
భట్టి ఎండలో పాదయాత్ర చేసి అనారోగ్యం పాలు కావొద్దని సూచించారు గుత్తా. సలహాను స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 3:45 PM IST
ఎండలో పాదయాత్ర చేసి అనారోగ్యం పాలవొద్దు.. భట్టికి గుత్తా సలహా
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిందనే చెప్పాలి. ఆయా పార్టీ నేతలు వరుస మీడియా సమావేశాలు పెట్టి అపోజిషన్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. ఆయన పాదయాత్రపై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని అన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి. కాబట్టి ఎండలో పాదయాత్ర చేసి అనారోగ్యం పాలు కావొద్దని సూచించారు. ఆయన ఉచిత సలహాను స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. భట్టి విక్రమార్క ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు. ఒక వేళ ఆయనకు తెలిసినట్లు అయితే అందరికీ చెప్పాలని కోరారు. భట్టి విక్రమార్కది గమనం, గమ్యం లేని పాదయాత్ర అంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు కోల్పయిందన్నారు. నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నాయకులు సభ నిర్వహిస్తే విఫమైందని చెప్పారు. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిస్థిమితం లేని నాయకుడంటూ విమర్శించారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రైతులకు సాగునీరు అందించామని.. రోడ్లు వేయించామని.. ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ సమర్ధమైన నాయకుడు.. రాబోయే ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఎండలో పాదయాత్ర చేసి అనారోగ్యం పాలు కావొద్దని సూచించారు. ఆయన ఉచిత సలహాను స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.