Video: తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ ఆఫీసుపై దాడి జరిగింది.

By అంజి
Published on : 13 July 2025 1:11 PM IST

Gunshots, fire, protesters, attack, Teenmar Mallanna, MLC Kavitha

Video: తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ ఆఫీసుపై దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల తర్వాత నిరసనకారులు ఆయన కార్యాలయంపై దాడి చేయడంతో మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు మేడిపల్లిలోని తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై అటాక్‌ చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. కిటికీలు ధ్వంసం చేయబడ్డాయి.

వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. కవితపై మల్లన్న అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మల్లన్నపై దాడికి ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ''బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కల్వకుంట్ల కవిత రంగులు పూసుకుంటోంది. ఆమెకు, బీసీలకు ఏం సంబంధం? నువ్వ బీసీనా? కంచం పొత్తు ఉందా? నువ్వు పండగ చేసుకోవడం ఏంటి?'' అని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడటమే జాగృతి కార్యకర్తల కోపానికి కారణమైనట్టు సమాచారం.

Next Story