తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి బయటపడిన విబేధాలు

Group War in Warangal Congress. తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు కొత్తేమీ కాదు. పైకి కలిసిపోయినట్లు నటిస్తూ ఉన్నా..

By M.S.R  Published on  31 May 2023 7:00 PM IST
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి బయటపడిన విబేధాలు

తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు కొత్తేమీ కాదు. పైకి కలిసిపోయినట్లు నటిస్తూ ఉన్నా.. ఒకరంటే మరొకరికి సరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అవి కాస్తా బయటపడ్డాయి. ఎంతగా అంటే ఒకరినొకరు కొట్టుకునేటంతగా.. వరంగల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరిపైఒక‌రు దాడి చేసుకున్నారు. అబ్నుస్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియామిస్తూ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకరానికి కొండా సురేఖను పిలవకపోవడంతో ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరు వర్గాలు బాహా బాహీకి దిగాయి.

కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంతోష్‌పై ఎర్రబెల్లి వర్గం దాడి చేసింది. ఎర్రబెల్లి వర్గానికి చెందిన కట్ట స్వామి దాడికి పాల్పడ్డాడు. గొడవకు దిగిన కార్యకర్తల అంతు చూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ ఇచ్చారు. గొడవకు దిగిన వారితో స్వర్ణ భర్త మాట్లాడి సర్దుమణిగేలా చేశారు. కులం పేరుతో దూషించినందుకే గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.


Next Story