గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది

By Medi Samrat  Published on  19 Feb 2024 5:12 PM IST
గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. గత ప్రభుత్వంలో 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం గ‌తంలో జారీ చేసిన ఆ నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ ఇప్పుడు రద్దు చేసింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే పలుమార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరికొన్ని పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అరవై పోస్టులను అదనంగా కలుపే అవకాశాలున్నాయి. గతంలో ప్రశ్నాపత్రం లీకు కావడంతో పరీక్షను రద్దు చేస్తూ గ‌త‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Next Story