నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఈ రూల్స్‌ తప్పనిసరి

నేటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ ప, రీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

By అంజి  Published on  21 Oct 2024 6:28 AM IST
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఈ రూల్స్‌ తప్పనిసరి

హైదరాబాద్‌: నేటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ ప, రీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల దగ్గర ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. ఈ సెక్షన్‌ ప్రకారం పరీక్ష కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు.

ప్రతి సెంటర్‌ దగ్గర ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్లాన్‌ చేశారు. పరీక్ష గది, చీఫ్‌ సూపరింటెండెంట్‌, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించనున్నారు. 27వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు తరలించే వెహికల్‌ నిర్దేశిత రూట్‌లో ప్రయాణించేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. 31,383 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

డీఎఫ్‌ఎండీలతో తనిఖీ చేశాకే.. అభ్యర్థులను లోపలికి పంపించనున్నారు. హాల్‌టికెట్‌పై పేర్కొన్న సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నియామకాలు పూర్తయ్యే వరకు హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు భద్రపర్చుకోవాలి. అభ్యర్థులు బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్‌, పెన్సిల్‌, రబ్బరు, హాల్‌టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. మొదటి రోజు ఉంచి చివరి రోజు వరకు ఒకే హాల్‌టికెట్‌ను ఉపయోగించాలి. అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి. వేర్వేరు భాషల్లో రాస్తే వాటిని టీజీపీఎస్సీ అనర్హమైనవిగా ప్రకటిస్తుంది.

Next Story