తెలంగాణ‌లో రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ వెబ్‌సైట్లు ప‌నిచేయ‌వు

Govt Websites wont work for two days.తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ వెబ్‌సైట్స్ నిలిచిపోనున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 10:21 AM IST
తెలంగాణ‌లో రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ వెబ్‌సైట్లు ప‌నిచేయ‌వు

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్ర‌భుత్వ వెబ్‌సైట్స్ నిలిచిపోనున్నాయి. యూపీఎస్(అన్ ఇంట‌ర‌ఫ్ట‌బుల్ ప‌వ‌ర్ స‌ప్లై) స్థాయి పెంపు నేపథ్యంలో ప్రభుత్వం వెబ్‌ సైట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంట‌ల నుంచి 11వ తేదీ రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు ప్రభుత్వ వెబ్ సైట్లకు అంతరాయం ఏర్పడనున్న‌ట్లు చెప్పారు. డేటా కేంద్రం ద్వారా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ వెబ్‌సైట్ల ఆన్‌లైన్ సేవ‌లు న‌డుస్తున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో విద్యుత్ అంత‌రాయాలు కూడా ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న యూపీఎస్ యూనిట్ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా లేక‌పోవ‌డంతో స్థాయిని పెంచాల‌ని నిపుణులు ప్ర‌తిపాదించారు. ఈ నేపథ్యంలో కొత్త యూపీఎస్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు శుక్రవారం నుంచి ఆదివారం రాత్రి వరకు ఏర్పడే అంతరాయాల గురించి అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

Next Story