గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ట్విట్టర్ (X) ఖాతా హ్యాక్ అయినట్లు తెలంగాణ పోలీసులు

By Medi Samrat
Published on : 17 Jan 2024 5:50 PM IST

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ట్విట్టర్ (X) ఖాతా హ్యాక్ అయినట్లు తెలంగాణ పోలీసులు జనవరి 17 బుధవారం నాడు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఓ మెయిల్ వచ్చింది. గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా పాస్ వర్డ్ తప్పంటూ సమాధానం వచ్చింది. గవర్నర్ ట్విట్టర్ ఖాతాలో సంబంధంలేని పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై రాజ్ భవన్ సిబ్బందిని గవర్నర్ ఆరా తీసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాజ్ భవన్ అసిస్టెంట్ కంప్ట్రోలర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.

సైబర్ క్రైమ్‌లో రాజ్ భవన్ అధికారులు ఈనెల 14న ఫిర్యాదు చేశారు. గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఇతర మేసేజ్ రావడంతో పోలీసులకు అధికారులు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story