మ‌హిళ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై స్పెష‌ల్ విషెస్‌

బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ మహిళలకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

By Medi Samrat  Published on  13 Oct 2023 6:30 PM IST
మ‌హిళ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై స్పెష‌ల్ విషెస్‌

బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ మహిళలకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు రాజ్ భ‌వ‌న్‌ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం సంద‌ర్భంగా తెలంగాణ మహిళలంద‌రికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బతుకమ్మ అనేది ప్రకృతి మాతతో ముడిపడి ఉన్న చాలా ప్రత్యేకమైన పండుగ. ముఖ్యంగా తెలంగాణ మహిళల జీవన‌ వేడుక అని పేర్కొన్నారు.

సీజనల్‌గా లభించే పూలతో అలంకరించే బతుకమ్మలో వర్షపు నీటిని శుభ్రం చేసే ఔషధగుణాలు ఉంటాయని పేర్కొన్నారు. గౌరీదేవి ఆశీస్సులతో అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Next Story