ఎన్నిక‌ల‌లో పోటీపై గవర్నర్ తమిళిసై కీల‌క వ్యాఖ్య‌లు

Governor Tamilisai Key Comments on contesting elections. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి

By Medi Samrat
Published on : 23 July 2023 5:45 PM IST

ఎన్నిక‌ల‌లో పోటీపై గవర్నర్ తమిళిసై కీల‌క వ్యాఖ్య‌లు
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమిళిసై స్పందించారు. తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, కేంద్రంలోని బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటారని తమిళిసై పేర్కొన్నారు. పుదుచ్చేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఎంపీ పదవికి పోటీ చేసే విషయంపై తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనని స్ప‌ష్టం చేశారు. పైనున్న దేవుడు, బీజేపీ అథిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, అధికార బీఆర్ఎస్ వ‌ర్గాల‌ మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వ తీరును గ‌వ‌ర్న‌ర్, గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయాలు మాట్లాడుతున్నార‌ని బీఆర్ఎస్ త‌ప్పుబ‌డుతున్నారు. అడ‌పాద‌డ‌పా కొన్ని కార్య‌క్ర‌మాలలో గ‌వ‌ర్న‌ర్‌, సీఎం పాల్గొన్నా.. రాజ్ భ‌వ‌న్‌కు, స‌చివాల‌యానికి మ‌ధ్య‌ స‌యోధ్య మాత్రం కుద‌ర‌ట్లేదు.


Next Story