యాదాద్రి : వటపత్రసాయి అలంకార సేవలో పాల్గొన్న గవర్నర్‌

Governor participates in Vatapatrasai Alankara Seva at Yadadri. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని

By Medi Samrat
Published on : 24 Feb 2023 2:15 PM IST

యాదాద్రి : వటపత్రసాయి అలంకార సేవలో పాల్గొన్న గవర్నర్‌

Governor participates in Vatapatrasai Alankara Seva


గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు నిర్వహిస్తున్న వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు. ఉదయం 9.05 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్.. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని మాడవీధిలో నిర్వహించిన సేవా ఊరేగింపులో కూడా ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ కార్యనిర్వాహక అధికారిణి గీత స్వాగతం పలికారు. ఫిబ్రవరి 28న జరగనున్న కల్యాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.




Next Story