హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Governor Dattatreya Met Accident. నల్లగొండలో పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

By Medi Samrat  Published on  14 Dec 2020 12:38 PM IST
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

నల్లగొండలో పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో కారు రోడ్డు పక్కకు దూసుకు పోయింద‌ని తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు. కొద్దిసేపటి తర్వాత గవర్నర్ దత్తాత్రేయ మరో వాహనంలో నల్లగొండకు బయల్దేరారు.


Next Story