అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు

మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.

By -  Knakam Karthik
Published on : 23 Sept 2025 3:47 PM IST

Hyderabad News, Government Of Telangana, agriculture students, Minister Ponnam, Jyotiraopule Gurukula Society

హైదరాబాద్: సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఇంచార్జి సెక్రటరీ బుద్దా ప్రకాష్ , వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ , రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య, ఎంజెపి గురుకుల సెక్రటరీ సైదులు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరింత నాణ్యమైన టెక్నికల్ విద్యను అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందానికి ఎంజేపి కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వనపర్తిలలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు వ్యవసాయ విశ్వ విద్యాలయ అధ్యాపకుల సమక్షంలో విద్యా బోధన. ఈ సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్ ,వనపర్తి వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. కాగా విద్యార్థులకు, ఫీల్డ్ విజిట్ ,మౌలిక సదుపాయాలు, ల్యాబ్ ,రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, దాని అనుబంధ కళాశాలల్లోనే నిర్వహణ జరిగేలా కసరత్తు చేస్తున్నారు.

Next Story