తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలుని కొనసాగించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆదేశాలు జారీచేశారు. ప్రమాదవశాత్తూ మరణించిన సభ్యులకు రూ.10 లక్షల వరకు బీమాని ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే 409 మందికి ప్రమాద బీమా మంజూరు చేసింది. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలోనే ప్రమాద బీమాను మరో నాలుగేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.