గుడ్‌న్యూస్: మినీ అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్: మినీ అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మినీ అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3,989 మినీ అంగన్వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లు పదోన్నతి కల్పించింది. ఇక నుంచి అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు కూడా వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడీ అనే తేడా లేకుండా ఇక నుంచి అందరూ అంగన్వాడీ టీచర్లే అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650 జీతం అందుకోనున్నారు. గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం రూ.7800 ఉండేది.
కాగా తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399 కాగా, హెల్పర్ పోస్టులు 7,837 ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నపిల్లకు ప్రీప్రైమరీ విద్యను అందించేందుకు అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.