సెకండియ‌ర్ ఫ‌లితాల‌ విడుదలకు మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఫెయిల్ అయ్యారా.. నో టెన్ష‌న్‌..

Government Issues Guidelines for Inter Second Year Results. క‌రోనా మ‌హ‌మ్మారి వృద్ధి నేఫ‌థ్యంలో ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను తెలంగాణ

By Medi Samrat  Published on  23 Jun 2021 12:56 PM GMT
సెకండియ‌ర్ ఫ‌లితాల‌ విడుదలకు మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఫెయిల్ అయ్యారా.. నో టెన్ష‌న్‌..

క‌రోనా మ‌హ‌మ్మారి వృద్ధి నేఫ‌థ్యంలో ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫ‌లితాల విడుద‌ల‌కు సంబంధించి.. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ బుధ‌వారం మార్గ‌ద‌ర్శ‌కాలు ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శికి విద్యాశాఖ కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీ చేశారు.

స‌బ్జెక్టుల్లో మొద‌టి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఇంట‌ర్ సెకండియ‌ర్ ప్రాక్టిక‌ల్స్‌కు పూర్తి మార్కులు కేటాయించ‌నున్నారు. గ‌తంలో ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు 35 శాతం మార్కులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ స‌బ్జెక్టుల‌కు రెండో ఏడాది 35 మార్కులు, ప్ర‌యివేటుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌తో సంతృప్తి చెంద‌ని విద్యార్థుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదిలావుంటే.. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో మార్గదర్శకాలు రూపొందించడంతో.. త్వరలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు ఫ‌లితాల‌ కోసం వెయిట్ చేస్తున్నారు.




Next Story