జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.382.5 కోట్లు కేటాయించిన సర్కార్

జోగులాంబ టెంపుల్ డెవలప్‌మెంట్‌కు రూ.382.5 కోట్లు కేటాయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

By Knakam Karthik
Published on : 31 July 2025 9:49 AM IST

Telangana, Gadwal District, Jogulamba temple development, Congress Government

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.382.5 కోట్లు కేటాయించిన సర్కార్

తెలంగాణలోని గద్వాల్ అలంపూర్‌ జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జోగులాంబ టెంపుల్ డెవలప్‌మెంట్‌కు రూ.382.5 కోట్లు కేటాయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. స‌చివాల‌యంలో జోగులాంబ ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ పై ఎండోమెంటు ఉన్న‌తాధికారులతో మంత్రి సురేఖ, స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అలంపూర్ జోగులాంబ టెంపుల్‌ను స‌మ‌గ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స‌మావేశంలో తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు చిన్నారెడ్డి, ఎండోమెంటు డిపార్టుమెంటు ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్‌, క‌మిష‌న‌ర్ వెంక‌ట‌రావు, తెలంగాణ ధార్మిక్ అడ్వ‌జ‌ర్ గోవింద హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... జోగులాంబ ఆలయ అభివృద్ధి విషయంలో త‌మ ప్రభుత్వం ఎక్క‌డా రాజీ ప‌డ‌ద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వివ‌రించారు. కృష్ణ-తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉంద‌ని.. ఈ టెంపుల్ ప్ర‌గ‌తికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. రానున్న రోజుల్లో భక్తులు, సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలోనే వ‌చ్చినా...ఆ మేర‌కు నిర్మాణ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ టెంపుల్‌ను మూడు విడ‌త‌ల్లో అభివృద్ధి చేస్తున్నామ‌ని, మొత్తం రూ. 382.5 కోట్ల‌తో అభివృద్ధి చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు.

Next Story