రాజా సింగ్ మరో విద్వేషపూరిత ప్రసంగం
రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఓడిపోతే హింసాత్మక పరిణామాలు ఉంటాయని రాజా సింగ్ మరోసారి విద్వేషపూరిత ప్రసంగం చేశారు.
By అంజి Published on 15 Nov 2023 7:03 AM ISTరాజా సింగ్ మరో విద్వేషపూరిత ప్రసంగం
హైదరాబాద్: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఓడిపోతే హింసాత్మక పరిణామాలు ఉంటాయని గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మరోసారి విద్వేషపూరిత ప్రసంగం చేశారు. హిందూత్వ వాచ్ ప్రకారం.. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 13, సోమవారం గోషామహల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం యొక్క చిన్న వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
'ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య': రాజా సింగ్
“ఈ ఎన్నికలు నాకు జీవన్మరణ సమస్య. నేను చనిపోవడానికి లేదా హత్య చేయడానికి భయపడను. ఏ సోదరుడైనా దేశద్రోహానికి పాల్పడే ముందు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే నా శత్రుత్వం చాలా ఖరీదైనది” అని అతను వీడియోలో ప్రజలను హెచ్చరించాడు. ఇంకా, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ, “ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ఈ ఒవైసీ ఎవరి కాళ్లపై పడతాడు?” అని ప్రజలను అడిగారు.
హిందువుల ఓటింగ్ పెరగాలి: రాజా సింగ్
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌లో హిందువుల ఓటింగ్ పెరగాలన్నారు. “గత ఎన్నికలలో ఓటింగ్‌ను మీరు గమనిస్తే, మా (హిందువులు) ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే, బీజేపీ ఎలాగైనా గెలుస్తుందని, ఎండ కింద క్యూలో నిలబడి ప్రయోజనం లేదని మన ఓటర్లు ఊహిస్తున్నారు. అయితే మీరు (బిజెపి క్యాడర్) ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆవులను చంపి లవ్ జిహాద్, మత మార్పిడికి పాల్పడే మన శత్రువులు 70,000 మంది ఉన్నారని, మన కౌంటింగ్ 0 నుండి ప్రారంభమవుతుందని వారికి (హిందూ ఓటర్లకు) చెప్పాలి, ”అని ఆయన అన్నారు.
2018 నుంచి మైనారిటీ ఓట్లు పెరిగాయని రాజా సింగ్ అన్నారు. ''గోషామహల్‌లో 15000 నుంచి 17000 బోగస్ ఓట్లు పెరిగాయి. ఎందుకంటే ఇంతమంది 2018 నుంచి ఒక లెక్క వేసుకున్నారు.. 2018లో మైనారిటీ ఓట్లు రెండు చోట్ల చీలిపోయాయి అందుకే ఈసారి అలా జరగకుండా చూసుకుంటున్నారు. గోషామహల్‌లో పచ్చజెండా ఎగురవేయడమే వారి లక్ష్యమని, ఇదే వారి టార్గెట్'' అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైనారిటీలు నా ఓటమికి నిధులు సమకూరుస్తున్నారు: రాజా సింగ్
గోషామహల్‌లో తనను ఓడించేందుకు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైనార్టీలు నిధులు పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ''నేను జైల్లో ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో చాలా మంది హిందువుల తలలు నరికేస్తామని చెప్పారు. బేటా, మీ కత్తి మా మెడకు దగ్గరగా వచ్చేందుకు, మా తలలు మేకలవి కావు. కత్తి దగ్గరికి రాకముందే, మేము మీ చేతులు కనిపించకుండా చేస్తాం'' అని రాజాసింగ్ అన్నారు.
మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు రాజా సింగ్‌ను బిజెపి సస్పెండ్ చేసింది. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీ తన అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేయడానికి ముందు కాషాయ పార్టీ అతన్ని తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, రాజా సింగ్‌పై 75 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో నమోదైన ద్వేషపూరిత ప్రసంగ కేసులే.
2018లో అతనిపై 43 కేసులు నమోదయ్యాయి, అందులో 38 ద్వేషపూరిత ప్రసంగ కేసులు ఉన్నాయి. గోషామహల్ నుంచి ప్రస్తుత బీఆర్‌ఎస్ నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్‌ను బరిలోకి దించగా, కాంగ్రెస్ తన అభ్యర్థిగా మొగిలి సునీతరావు ముధిరాజ్‌ను ప్రతిపాదించింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.