ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన గోరటి వెంకన్న.. ఆ ఇద్ద‌రు కూడా..

Goreti Venkanna Oath Taking As MLC. తెలంగాణ శాస‌న మండ‌లికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు

By Medi Samrat  Published on  18 Nov 2020 1:03 PM IST
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన గోరటి వెంకన్న.. ఆ ఇద్ద‌రు కూడా..

తెలంగాణ శాస‌న మండ‌లికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ముందుగా శాస‌న మండ‌లికి ఎన్నిక‌వుతార‌ని కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం కేసీర్ అనూహ్యంగా వీరి పేర్లును ఖరారు చేశారు. ఇక ప్ర‌మాణ స్వీకారం చేసిన నూత‌న మండ‌లి స‌భ్యుల‌కు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు బంగారు తెలంగాణ సాధనలో అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆకాంక్షించారు.


Next Story