హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Good news to Home Guards. రాష్ట్రంలో హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. హోంగార్డుల

By Medi Samrat  Published on  21 Dec 2021 1:48 PM GMT
హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రంలో హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. హోంగార్డుల గౌరవవేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించింది. తాజాగా వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఈ ఏడాది జూన్ నుంచి అమలులో రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


హోంగార్డుల జీతాలు పెంపడంతో పాటు, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అత్యంత మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇదే క్రమంలో ఇప్పుడు హోంగార్డుల అపరిష్కృత సమస్యలెన్నో పరిష్కరించారని హోంగార్డు సంక్షేమ సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డులలో ఆత్మవిశ్వాసం పెరుగనుంది.


Next Story
Share it