రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతు బంధు..!
Good news to farmers Raithu Bandu Funds Released from tommarow.రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2021 4:25 AM GMT
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన 8వ విడత రైతుబంధు నిధులను వీలైనంత వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. ఏడున్నర వేల కోట్లు నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు.
డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల చివరి వరకు రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో వేసేందుకు అధికారులు సిద్దం అయినట్లు తెలుస్తోంది. కాగా.. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది.
అప్పుడు తొలి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు తొలి రోజు, రెండు ఎకరాలు ఉన్నవారికి రెండో రోజు, మూడు ఎకరాలు ఉన్నవారికి మూడో రోజున రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో వేశారు. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు డబ్బును పంపిణీ చేశారు. ప్రస్తుతం కూడా అదే పద్దతిని అవలంభించాలని అధికారులు బావిస్తున్నట్లు తెలుస్తోంది.