తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే నెలకు రూ.2,500
మహిళలకు ప్రతి నెలా రూ.2500 సాయం అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
By అంజి Published on 16 Jun 2024 7:30 AM ISTతెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే నెలకు రూ.2,500
మహిళలకు ప్రతి నెలా రూ.2500 సాయం అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రూ.500 కే సిలిండర్, గృహలక్ష్మి స్కీమ్‌లో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిపారు.
మహిళలు బ్యాంకులు ఇచ్చే లోన్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను మంత్రి సీతక్క విడుదల చేశారు. మహిళా సంఘాల విషయంలో బ్యాంకులు ప్రభుత్వం చెప్పిన లోన్లు ఇవ్వాలని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని మంత్రి సూచించారు. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలో సెక్రటేరియట్, కలెక్టరేట్లు, అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, ఇండస్ట్రియల్ఏరియాల్లో దశలవారీగా వీటిని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.