తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. నేడు రాష్ట్రానికి 9,039 మెట్రిక్‌ టన్నుల యూరియా

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన తీపికబురుతో ఎట్టకేలకు రైతులకు యూరియా కష్టాలు తీరేట్టు కనిపిస్తున్నాయి.

By అంజి
Published on : 6 Sept 2025 6:57 AM IST

Telangana, farmers, urea, Minister Tummala nageshwararao

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. నేడు రాష్ట్రానికి 9,039 మెట్రిక్‌ టన్నుల యూరియా

హైదరాబాద్: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన తీపికబురుతో ఎట్టకేలకు రైతులకు యూరియా కష్టాలు తీరేట్టు కనిపిస్తున్నాయి. యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసింది.

రాష్ట్రానికి 11, 181 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపశమనం కలిగే వార్త చెప్పారు. రేపు రాష్ట్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్టు తెలిపారు. రానున్న 20 రోజుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అటు రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మూత పడటంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుంచి కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించడానికి అంగీకరించిందని తెలిపారు. ఈ పరిణామాలతో తెలంగాణలో ఎరువుల లభ్యత మరింత మెరుగుపడుతుందని మంత్రి అన్నారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. బస్తాల కోసం రైతులు దుకాణాలా ముందు రోజులకొద్దీ వేచి చూస్తున్నారు.

Next Story