తెలంగాణ నుంచి తిరుమల వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌

Good news for passengers traveling on the TSRTC bus to Tirumala.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 3:52 AM GMT
తెలంగాణ నుంచి తిరుమల వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌

తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే శ్రీవారి భ‌క్తుల‌కు టీఎస్ఆర్టీసీ(తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌) శుభ‌వార్త చెప్పింది. ఆర్టీసీ బ‌స్ టికెట్‌తో పాటే తిరుమ‌ల ద‌ర్శ‌న టోకెన్‌నూ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేర‌కు టీటీడీ, టీఎస్ఆర్టీసీ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కావాలనుకున్న వారు ప్రయాణానికి రెండు రోజుల ముందు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ చేసిన ఈ ప్రకటనపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఆఫర్లు మరిన్ని ప్రకటిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..

దర్శనానికి వెళ్లే ప్రయాణికులు 2 డోసుల కోవిడ్‌ టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ను గానీ లేదా దర్శ నానికి 72 గంటల్లోపు పొందిన క‌రోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను గానీ సమర్పించాల్సి ఉంటుంది.

Next Story
Share it