టెక్స్‌టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్‌న్యూస్..75 గజాలకు స్థలం పెంపు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) భూ నిర్వాసితులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు

By -  Knakam Karthik
Published on : 1 April 2026 9:00 PM IST

Telangana, Warangal, KakatiyaTextilePark, Rehabilitation, TelanganaGovernment, HouseSites

టెక్స్‌టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్‌న్యూస్..75 గజాలకు స్థలం పెంపు 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) భూ నిర్వాసితులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ సత్య శారద ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో ప్లాట్లను కేటాయించారు.

గతంలో ఇచ్చిన 50 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇప్పుడు 75 గజాలకు పెంచిందని, భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టౌన్‌షిప్‌లో రూ. 80 కోట్లతో పాఠశాల, ఆసుపత్రి, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, నిర్వాసిత కుటుంబాల్లోని అర్హులకు టెక్స్‌టైల్ పార్క్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ లేఅవుట్లు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story