వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదు : గోనె ప్రకాశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Gone Prakash Rao Sensational Comments On Jagan. భారతి కోసమే షర్మిళ, విజయమ్మను జగన్ దూరంగా పెట్టారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

By Medi Samrat  Published on  25 April 2023 1:08 PM GMT
వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదు : గోనె ప్రకాశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భారతి కోసమే షర్మిళ, విజయమ్మను జగన్ దూరంగా పెట్టారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహం అని అన్నారు. షర్మిళ పోలీసులను కొట్టారని నేనో వీడియోలో చూశాను. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని సూచించారు. షర్మిళ నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడనన్నారు. షర్మిళ రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా..? ఆమె పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అని ప్ర‌శ్నించారు.

జగన్ షర్మిళను చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిళను కలిశారు. ఆమెకు సాయం కింద రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. ఆ ఎంపీ షర్మిళ వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని స్వయంగా సీఎం జగన్ ఆయనకు ఫోన్ చేశారు. ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరమేం ఉందని బెదిరించారని అన్నారు. షర్మిళ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్నా.. షర్మిళ మీద ఎందుకంత కోపం..? అని ప్ర‌శ్నించారు.

షర్మిళ నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదని అన్నారు. వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని విమ‌ర్శించారు. వైఎస్సార్‌ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని అన్నారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనేవారే ఆయనకు నచ్చుతారని అన్నారు. తన తండ్రి వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదని అన్నారు. విజయమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ క్యాబినెట్లో ఉన్నారని అన్నారు.

విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదు..? అని ప్ర‌శ్నించారు. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా..? లేదా..? అని అడిగితే.. నీలం సంజీవరెడ్డిని కులం అడిగినట్టుందని అన్నారు. వైఎస్ వివేకా హ‌త్య‌లో అవివాష్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. చాలా మంది పెద్ద వాళ్లు.. మాజీ కేంద్ర మంత్రులు.. మాజీ సీఎంలు.. మాజీ మంత్రులు జైళ్లకు వెళ్లారు. వాళ్లకంటే అవినాష్ రెడ్డి గొప్పేం కాదని అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయి. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు వ‌స్తాయ‌న్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమ‌న్నారు. కొందరు విశ్లేషకులు డబ్బులు తీసుకుని అనుకూలంగా చెబుతున్నారని విమ‌ర్శించారు.

ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లు.. మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. సంక్షేమం ఎన్టీఆర్‌తోనే మొదలైందని అన్నారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా..? అని ప్ర‌శ్నించారు. సంక్షేమం, నిధులు జగన్ తన జేబుల్లో నుంచి ఇస్తున్నారా..? అని ప్ర‌శ్నించారు.




Next Story