మళ్లీ పెరిగిన గోదావరి నీటిమట్టం
Godavari in spate again at Bhadrachalam. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతూ ఉంది..
By Medi Samrat Published on 25 July 2022 2:18 PM GMTభద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతూ ఉంది.. సోమవారం మొదటి హెచ్చరిక స్థాయిని దాటింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 43.60 అడుగుల నీటిమట్టం ఉండగా.. 9.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొదటి హెచ్చరిక స్థాయి కంటే నీటిమట్టం ఎక్కువ ఉంది, సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 43.50 అడుగులకు 9.55 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉంది. నదిలో నీటి మట్టం ఆదివారం మొదటి హెచ్చరిక స్థాయి కంటే దిగువకు తగ్గింది.. అయితే నది పరివాహక ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మళ్లీ పెరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చెర్ల మండలంలో 6.2, పినపాకలో 5.9, మణుగూరులో 5 సెం.మీ, టేకులపల్లి, భద్రాచలం రెండు మండలాల్లో 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో నాలుగు మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన మండలాల్లో గడచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా యెల్లందు, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎస్‌సీసీఎల్ ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి దెబ్బతింది. అనేక వరద ప్రభావిత గ్రామాల నుండి తరలించబడిన ప్రజలు ఇప్పటికీ బూర్గంపాడ్, భద్రాచలం, ఇతర ప్రాంతాలలోని సహాయక కేంద్రాలలోనే ఉన్నారు.