మీరు ఎదురుచూస్తున్న డెలివరీ మీకు చేరలేదా.?

దేశవ్యాప్తంగా స్విగ్గీ, జోమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 6:01 PM IST

మీరు ఎదురుచూస్తున్న డెలివరీ మీకు చేరలేదా.?

దేశవ్యాప్తంగా స్విగ్గీ, జోమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున సమ్మెకు పిలుపునిచ్చారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. పని సమయాలు ఎక్కువగా ఉండటం, వేతనాలు తగ్గడం, భద్రత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని వర్కర్లు కోరుతున్నారు.

అమెజాన్, జొమాటో, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సేవలు అందించడంలో డెలివరీ కార్మికులు ఎంతో కీలకం. వీరు డిసెంబర్ 25, డిసెంబర్ 31, 2025 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. వీరికి సంబంధించిన పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెను ప్రకటించాయి. మెట్రో నగరాల, ప్రధాన టైర్-2 నగరాల నుండి డెలివరీ కార్మికులు సమ్మెలో భాగమయ్యారు. పారదర్శక ఇన్‌సెంటివ్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత, ఐడీ బ్లాకింగ్‌-పెనాల్టీలు ఆపడం, విశ్రాంతి సమయాలు వంటి డిమాండ్లతో ఈ నిరసన జరుగుతోంది. వేతన, పని లక్ష్యాలను నిర్ణయించే అల్గోరిథంలపై ప్లాట్‌ఫామ్ కంపెనీలకు అధిక నియంత్రణ ఉండడాన్ని యూనియన్లు తప్పుబడుతున్నాయి.

Next Story