సీఎం రేవంత్‌ను కలిసిన జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.

By Knakam Karthik
Published on : 5 Sept 2025 3:01 PM IST

Telangana, Cm Revanthreddy,  BEBIG Medical Company Chairman

సీఎం రేవంత్‌ను కలిసిన జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్

హైదరాబాద్: వైద్య పరికరాల తయారీలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ BEBIG Medical తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్తీకరించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.

వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కంపెనీ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబందించి అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఈక్విప్‌మెంట్‌తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కోరారు.

Next Story