బ్రేకింగ్‌ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర

Gang planning to kill Telangana Minister Srinivas Goud nabbed. పేట్‌బషీరాబాద్ పోలీసులు బుధవారం హత్యా ప్రణాళికను భగ్నం చేశారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను

By Medi Samrat  Published on  2 March 2022 3:28 PM GMT
బ్రేకింగ్‌ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర

పేట్‌బషీరాబాద్ పోలీసులు బుధవారం హత్యా ప్రణాళికను భగ్నం చేశారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నిందితులు మంత్రి, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను చంపడానికి రూ.12 కోట్ల‌కు కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకున్నారని తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర కాసేపట్లో మీడియాకు వెల్లడించనున్నారు. ఇదిలావుంటే.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు హస్తిన పర్యటనకు వెళ్లిన బృందంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఉన్నారు.


Next Story
Share it