కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
Gajendra Singh Shekhawat hits out at KCR. ఏపీ-తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల తీవ్
By M.S.R Published on 12 Nov 2021 10:25 AM ISTఏపీ-తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలపై ఏడేళ్లుగా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్ కోసం సీఎం కేసీఆర్ అడిగారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. పిటిషన్ వెనక్కి తీసుకోమని అడిగాను.. రెండ్రోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.
సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8నెలలు పట్టిందని కేసీఆర్ ను విమర్శించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం ఎలా చర్యలు తీసుకుంటుందని షెకావత్ ప్రశ్నించారు. ఏడేళ్ల జాప్యానికి కేంద్రాన్ని, నన్ను ఎలా బాధ్యులను చేస్తాడని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం అడిగాం.. దాని కోసం వేచి చూస్తున్నామని షెకావత్ వెల్లడించారు. కేసీఆర్ చేస్తున్నది అంతా ఒక డ్రామా అని.. పార్లమెంట్ ఉభయసభల్లో అమోదించిన అంశాలపై ఇష్టారీతిన ఎలా మాట్లాడతారని షెకావత్ ప్రశ్నించారు.