నాకు రక్షణ కల్పించండి : గాయకుడు గద్దర్

Gaddar Submitted A Petition To The Jangaon Collector And Dcp For Seeking Protection. నాకు రక్షణ కల్పించాలంటూ ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ వ‌రంగ‌ల్‌ వెస్ట్ జోన్ డిసిపి సీతారాములను

By Medi Samrat
Published on : 19 Nov 2022 6:27 PM IST

నాకు రక్షణ కల్పించండి : గాయకుడు గద్దర్

నాకు రక్షణ కల్పించాలంటూ ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ వ‌రంగ‌ల్‌ వెస్ట్ జోన్ డిసిపి సీతారాములను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంత‌రం అన్యాక్రాంతమైన‌ బాలసాయి బాబా ట్రస్ట్ భూములను కాపాడాలని జ‌న‌గామా కలెక్టర్ శివ లింగయ్యకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని రఘునాథపల్లి మండలం మండల గూడెం గ్రామంలో అన్యాక్రాంత‌మైన‌ బాల సాయిబాబా ట్రస్ట్ భూముల విష‌య‌మై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి తరచూ వస్తున్నానని, అందువల్ల కొందరు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని డీసీపీని కోరిన‌ట్లు తెలిపారు. మండలగూడెం గ్రామంలో ఉన్న 59 ఎకరాల భూములు రియల్టర్ల చేతికి చిక్కాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుని, సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు గద్దర్ తెలిపారు.





Next Story