ముగిసిన గద్దర్ అంత్యక్రియలుప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిసాయి.బౌద్ధ మత పద్ధతిలో ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. గద్దర్ ఆఖరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. సీఎం కేసీఆర్.. గద్దర్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అభిమానులు, కవులు, కళకారులు భారీగా తరలివచ్చి గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికారు.