ఆ విష‌యంపై సీరియ‌స్‌గా అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గాలి : గ‌ద్ద‌ర్

Gaddar demands to put Ambedkar Name to new parliament building. ఢిల్లీలో నూత‌నంగా నిర్మిస్తున్న పార్ల‌మెంట్‌ భ‌వ‌నానికి డా బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల‌ని ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్

By Medi Samrat  Published on  17 Jan 2023 10:24 AM GMT
ఆ విష‌యంపై సీరియ‌స్‌గా అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గాలి : గ‌ద్ద‌ర్

ఢిల్లీలో నూత‌నంగా నిర్మిస్తున్న పార్ల‌మెంట్‌ భ‌వ‌నానికి డా బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల‌ని ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సకల సంపదలు గల దేశంలో దరిద్రమెట్లుందని..? ప్ర‌శ్నించారు. దరిద్రం మొదటి నుండి పాలించిన పాలకులదా .? ప్రజలదా..? పాలసీలల్లో లోపం ఉందా..? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ లో భూమి, నీరు, పని చేసేవారు ఉండగా దరిద్రమెట్లుంది.. ఇది నాదే కాదు ప్రజల ప్రశ్న కూడా.. దీని మీద సీరియస్ గా అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు.

పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టడం కూడా రాజకీయాంశమేన‌ని ఆరోపించారు. పార్లమెంటుకు పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేసి పెట్టాలని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. పార్లమెంట్‌కు డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టేన‌ని అన్నారు. బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామ‌ని గ‌ద్ద‌ర్ పేర్కొన్నారు. నూతన సెక్రటరీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో డా. బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కూడా చేర్చాలని కోరారు.


Next Story