వాహనాల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరించడానికి, ప్రాసెసింగ్ జాప్యాలను తగ్గించడానికి తెలంగాణ రవాణా శాఖ గురువారం పూర్తి డిజిటల్, పేపర్‌లెస్ సిస్టమ్‌కు మారుతున్నట్లు ప్రకటించింది. మోటార్‌సైకిళ్లు, కార్లతో సహా అన్ని రవాణాయేతర వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఇది వర్తిస్తుంది. ఈ చర్యతో, డీలర్లు పత్రాలను పిజికల్‌గా సమర్పించే సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలుకనున్నట్లు రవాణా శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను శాఖ గురువారం విడుదల చేసింది. మార్చి 13 (శుక్రవారం) నుండి పూర్తి డిజిటల్, పేపర్‌లెస్ సిస్టమ్ అమలు చేయబడుతుంది. ఫామ్ 20 సహా అన్ని పత్రాల స్కాన్ కాపీలు మాత్రమే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇకపై RTA కార్యాలయాలకు ఫిజికల్ పత్రాల సమర్పణ ఉండదు. మార్చి 13 తర్వాత TR పొందిన వాహనాలకు పేపర్ పత్రాలు స్వీకరించరు. పాత TR వాహనాలకు కూడా ఆన్‌లైన్ ద్వారా PR అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు రెండు పని దినాల్లో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. డీలర్లు 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ లాగిన్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.