మల్లు స్వరాజ్యం కన్నుమూత
Freedom Fighter Mallu Swarajyam was Died. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు
By Medi Samrat Published on
19 March 2022 3:16 PM GMT

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మల్లు ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామం భూస్వామ్య కుటుంబంలో 1931వ సంవత్సరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆమె నైజాం సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించారు. మహిళ కమాండర్ గా పని చేసిన మల్లు స్వరాజ్యంపై అప్పటి ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన ఆమె.. మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.
Next Story