మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌

Free TSRTC bus rides for mothers travelling on Mother’s Day. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ ప్రత్యేక ఆఫర్‌ను అందజేస్తోంది

By Medi Samrat
Published on : 6 May 2022 7:13 PM IST

మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ ప్రత్యేక ఆఫర్‌ను అందజేస్తోంది. ఆఫర్‌లో భాగంగా.. టీఎస్ఆర్టీసీ ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులకు ఏసీ సర్వీసుల్లో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత సేవల ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్‌ను మే 8 ఆదివారం నాడు వినియోగించుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఈ సందర్భంగా తల్లులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన అద్భుతమైన మహిళలందరికీ మన ప్రేమ, గౌరవాన్ని అందించడానికి మాతృ దినోత్సవం గొప్ప సమయం అని అన్నారు.








Next Story