రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్లుగా పీవీ శ్రీనివాస రావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణ రావు పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నలుగురిని గవర్నర్ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు మూడేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. కాగా ఇదే ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజ్ భవన్ క్లియరెన్స్ ఇచ్చింది.