కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు
Former Union Minister Balram Naik has been disqualified contesting elections. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.
By Medi Samrat Published on
23 Jun 2021 2:30 PM GMT

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్ సమర్పించలేదు. దీంతో బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. బలరాం నాయక్‌పై వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇదిలావుంటే.. బలరాం నాయక్ 2009లో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఆయన మంత్రిగా పని చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన.. బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిపై కూడా ఈసీ అనర్హతా వేటు వేసింది.
Next Story