మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

By Medi Samrat  Published on  13 Nov 2024 12:30 PM GMT
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టుకు తరలించే క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ అక్రమమన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి పరువు పోయిందన్నారు.

పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ నరేందర్ రెడ్డి భార్య శృతి, తల్లిని కలిసి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌ను చూసి పట్నం నరేందర్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు.

Next Story