పైలెట్‌గా మారిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కల నిజమైందని పోస్ట్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 3:55 PM IST

Hyderabad News, Former MLA Ketireddy, PrivateJet, Ysrcp

పైలెట్‌గా మారిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కల నిజమైందని పోస్ట్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ను నడిపిన వీడియోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడిపిన కేతిరెడ్డి హైదరాబాద్ గగన వీధుల్లో విహరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు. తన కల సాకారమైందని, ఇప్పుడు తానొక సర్టిఫైడ్ పైలెట్ అని వెల్లడించారు.

"ఆకాశం ఇక హద్దు కాదు... ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠానికి, ఈ ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక మీదట అంతులేని సాహసాలే. ఒంటరిగా ఇదే నా తొలి గగన విహారం... అందుకు వింగ్స్ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ఫస్ట్ ఫ్లయింగ్ వీడియోను కూడా పంచుకున్నారు.

Next Story