కొడంగల్ రాజకీయాల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత‌

Former MLA Gurunath Reddy joins in congress party. కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో పెను సంచలనం న‌మోదైంది.

By Medi Samrat  Published on  27 Jan 2023 4:05 PM IST
కొడంగల్ రాజకీయాల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత‌
కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో పెను సంచలనం న‌మోదైంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. గుర్నాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప లు కాంగ్రెస్ గూటికి చేరనున్న‌ట్టు తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలోని దిగ్గజ నాయకుల్లో గుర్నాథ్ రెడ్డి ఒకరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గుర్నాథ్ రెడ్డిది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుంది. భారీగా సొంత ఓటు బ్యాంక్ ఉన్న‌ గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనే చర్చ సాగుతోంది.


Next Story