మాజీ మంత్రి, మాజీ సీబీఐ డైరెక్టర్ కే. విజయరామారావు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 1959 అక్టోబర్‌లో ఐపీఎస్ ట్రైనీగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన.. చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విజయరామారావు.. తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా పని చేశారు. సీబీఐ డైరెక్టర్‌గా.. హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు తదితర కేసులు దర్యాప్తు చేశారు.
1999లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అప్పటి సీఎల్పీ నేత పీ జనార్ధన రెడ్డిపై ఖైరతాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటిసారే రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అనంతరం 2004 ఎన్నికల్లో పీ జనార్ధన రెడ్డి, 2009 ఎన్నికల్లో దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో టీఆర్ఎస్‌లో చేరారు. విజయరామారావు స్వస్థలం వరంగల్ జిల్లా ఏటూరు నాగారం.