కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఇంద్రకరణ్‌ రెడ్డి

లోక్​సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు బిగ్​ షాక్ తగిలింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

By అంజి  Published on  1 May 2024 2:30 PM GMT
Former minister Indrakaran Reddy, Congress, Telangana

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఇంద్రకరణ్‌ రెడ్డి

లోక్​సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు బిగ్​ షాక్ తగిలింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. అంతకుముందు బీఆర్ఎస్‌కు ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2014లో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇంద్రకరణ్‌ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ త‌ర‌పున నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ హయాంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాదాయ‌, అట‌వీశాఖ మంత్రిగా ప‌ని చేశారు.

Next Story