తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ - హైదరాబాద్, హైదరాబాద్ - ఢిల్లీ ఎయిరిండియా విమానం, హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - హైదరాబాద్ ప్లైట్ ఆలస్యమైంది. పొగమంచు కారణంగా శంషాబాద్ - బెంగళూరు నేషనల్ హైవేపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ - వరంగల్, వరంగల్ - ఖమ్మం నేషనల్ హైవేలతో పాటు ఇతర రహదారుల్లో భారీగా పొగమంచు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలను పొగమంచు పూర్తిగా కప్పేసింది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టో, కిస్మత్ పూర్ తో పాటు ఔటర్ రింగు రోడ్డు పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలు కనిపించక పోవడంతో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. ఫాగ్ లైట్స్ వేసినప్పటికి రహదారులు కనిపించడం లేదు.