జగిత్యాలలో వింత‌.. ఆకాశం నుండి కురుస్తున్న చేపలు..!

Fish Rain in Telangana. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  10 July 2022 12:59 PM GMT
జగిత్యాలలో వింత‌.. ఆకాశం నుండి కురుస్తున్న చేపలు..!

జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలో చేపల వర్షం కురిసింది. పట్టణంలోని సాయినగర్ లో వర్షపు నీటితో పాటు చేపలు వుండటం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్, శాంతినగర్ శివాలయం రోడ్డు, పినపాకల్లో కూడా గత శుక్రవారం చేపల వర్షం కురిసింది. జగిత్యాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఆకాశంలో నుండి చేపలు కింద పడ్డాయి. చేపల వాన కురిసింది. సాయినగర్ కాలనీలో వర్షంతో పాటు చేపలు పడడం చూసి స్థానికులు నివ్వెరపోయారు.

కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వర్షపు చినుకులతో పాటు చేపలు పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. జులై 5న కాళేశ్వరంలో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడ్డాయి. ప్రాణంతో ఉన్న వాటిని కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు.Next Story
Share it