ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రేప‌టి నుండి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బంద్

First doses likely to be on hold till Telangana receives more vaccines. తెలంగాణలో క‌రోనా టీకా కొర‌త నేఫ‌థ్యంలో రేపటి నుంచి సెకండ్ డోస్ మాత్రమే

By Medi Samrat  Published on  7 May 2021 9:28 PM IST
ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రేప‌టి నుండి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బంద్

తెలంగాణలో క‌రోనా టీకా కొర‌త నేఫ‌థ్యంలో రేపటి నుంచి సెకండ్ డోస్ మాత్రమే ఇవ్వాలని ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. టీకా మొదటి డోస్‌కు బ్రేక్‌ ఇచ్చి రెండో డోస్‌ కంప్లీట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేఫ‌థ్యంలోనే మే 15 వరకు ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి డోస్ వేసుకున్న 11 లక్షల మంది.. సెకండ్ డోస్ కోసం నిరీక్షిస్తున్నార‌ని లెలిపింది. రెండో డోస్ ఆలస్యం కావద్దని.. తొలుత రెండో డోసు వారికి వ్యాక్సినేష‌న్‌ ప్ర‌క్రియ పూర్తిచేయ‌నున్న‌ట్లు పేర్కొంది. దీంతో రేప‌టి నుండి మొదటి డోస్ బంద్ కానుంది.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 76,047 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 5,892 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. నిన్న ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు.




Next Story