Hyderabad : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి దగ్ధం

హైదరాబాద్‌లోని మణికొండలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 7:04 AM GMT
Hyderabad : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి దగ్ధం

హైదరాబాద్‌లోని మణికొండలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. మంటలు చెలరేగిన తర్వాత గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు, భారీ శబ్ధం రావడంతో అపార్ట్‌మెంట్‌లోని వారంతా బయటకు పరుగులు తీశారు.

ప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రమాదంలో ఈ ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.50 లక్షల విలువైన ఆస్తి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదస్థలికి ఫైరింజన్ వెంటనే వచ్చినప్పటికీ లోపలకు వెళ్లడానికి దారిలేక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అపార్ట్‌మెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఫైరింజన్ లోనికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది. మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

Next Story